నవగీతం, జగిత్యాల ప్రతినిధి:
ఆర్థిక సంవత్సరం 2024-25 స్త్రీనిది కార్యక్రమాలలో జిల్లా రీజినల్ మేనేజర్ రాష్ట్రం లోనే ప్రథమ స్థానంలో నిలిచిన యం.రాం నారాయణ (పాత సిరిసిల్ల) ని, సెర్ప్ సిబ్బంది సీసీ లలో రాష్ట్రం లోనే ప్రథమ స్థానంలో నిలిచిన కే.పురుషోత్తం ఇబ్రాహీంపట్నం మండలం, (పాత మెట్ పల్లి) ని, స్త్రీనిది సిబ్బందిలో అసిస్టెంట్ మేనేజర్ లలో రాష్ట్రం లోనే తృతీయ స్థానంలో నిలిచిన వి.గంగజల ని గ్రామీణాభివృద్ధి శాఖ మాత్యులు ధనసరి అనసూయ మరియు సెర్ప్ సిఈఓ. దివ్య దేవరాజన్ ఐ ఏ ఎస్, స్త్రీనిది యం డి విద్యాసాగర్ రెడ్డి, డిప్యూటీ యం డి శ్రీనాథ్ ద్వారా స్త్రీనిది 13 వ సర్వసభ్య సమావేశం వేదిక గా ప్రోఫెసర్ జయశంకర్ విశ్వ విద్యాలయం లో నిర్వహించిన కార్యక్రమం లో వారిని శాలువ, జ్ఞపీక మరియు ప్రశంసపత్రం తో సత్కరిoచారు.ఈ సందర్బంగా జిల్లా గ్రామీణభివృద్ధి శాఖ అధికారి యం. రఘువరణ్, అదనపు ప్రాజెక్టు ఆధికారి పి. సునీత, జిల్లా డిపియo లు రమేష్, నారాయణ, నాగేశ్వర్ రావు, చక్రవర్తి, గంగాధర్, శ్రీనివాస్, దాస్, సత్యనారాయణ, తదితరులు అభినందనలు తెలిపారు.
8919841046149507201.jpg)