రోడ్డు ప్రమాద బాదితులను కాపాడండి
రహ్ వీర్ పథకం ద్వారా రూ.25 వేల పారితోషికం నవగీతం, జగిత్యాల ప్రతినిధి: రోడ్డు ప్రమాదాల సమయంలో గాయపడిన వారికి తక్షణ సహాయం అందించి వారి ప్రాణాలను కాపాడే బాధ్యతగల పౌరులను (గుడ్ సమారిటన్స్) ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన “రహ్ వీర్ పథకం” ద్వారా రూ.25,000/- నగదు పారితోషికం తో పాటు ప్రశంసా పత్రం అందజేయబడుతుందని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ట్ తెలిపారు. దేశవ్యాప్తంగా ప్రతి సంవత్సరం వేల సంఖ్యలో రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని, ప్రమాదం జరిగిన తొలి గంటను “గోల్డెన్ అవర్”గా...