నవగీతం, జగిత్యాల ప్రతినిధి:
జగిత్యాల లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో గొల్లపల్లి మండలంలోని లోత్తునూరు గ్రామంలో మంగళవారం ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని నిర్వహించారు. కరీంనగర్ లోని రేకుర్తి హాస్పిటల్ జగిత్యాల పార్థ హాస్పిటల్ వైద్యులు సంయుక్తంగా ఈ శిబిరాన్ని నిర్వహించి గ్రామస్తులకు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జగిత్యాల మాజీ మున్సిపల్ చైర్పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సమాజంలోని అట్టడుగు వర్గాలకు లయన్స్ క్లబ్ అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని పేర్కొన్నారు.ముఖ్యంగా అంధత్వ నివారణే లక్ష్యంగా ఉచిత నేత్ర పరీక్షలు, చికిత్సలు అందించడం అభినందనీయమని ఆమె అన్నారు. లయన్స్ క్లబ్ సేవలను మరింత విస్తరించి ఎక్కువ మందికి ప్రయోజనం చేకూరేలా సభ్యులు కృషి చేయాలని సూచించారు.ఈ శిబిరానికి లోత్తునూరు పరిసర గ్రామాల నుండి మొత్తం 88 మంది హాజరై కంటి పరీక్షలు చేయించుకున్నారు. వైద్యులు పరీక్షించిన వారిలో 33 మందికి శస్త్రచికిత్స అవసరమని గుర్తించారు. వారికి ఉచిత రవాణా సౌకర్యం కల్పించి కరీంనగర్‌లోని రేకుర్తి హాస్పిటల్‌కు తరలించినట్లు లయన్స్ క్లబ్ అధ్యక్షుడు వడ్లగట్ట శంకర్ తెలిపారు.శస్త్రచికిత్సలను బుధవారం ఉదయం నిర్వహించి, అనంతరం మరుసటి రోజు వారిని తిరిగి లోత్తునూరు గ్రామానికి చేర్చనున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో జగిత్యాల లయన్స్ క్లబ్ అధ్యక్షుడు వడ్లగట్ట శంకర్, ప్రధాన కార్యదర్శి గుండేటి గంగాధర్, కోశాధికారి సామల్ల శ్రీహరి, ప్రోగ్రాం చైర్పర్సన్‌గా పార్థ హాస్పిటల్ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ అంకం లక్ష్మణ్, ప్రసూతి. గర్భకోశ వ్యాధి నిపుణురాలు డాక్టర్ అంకం అరుణ, జగిత్యాల మాజీ మున్సిపల్ చైర్మన్ అడువాల జ్యోతి, డీసీ తాటిపాముల వినోద్ కుమార్, చార్టర్ ప్రెసిడెంట్ సభ్యులు, సిబ్బంది, రోగులు తదితరులు పాల్గొన్నారు.