లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత నేత్ర వైద్య శిబిరం

నవగీతం, జగిత్యాల ప్రతినిధి: జగిత్యాల లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో గొల్లపల్లి మండలంలోని లోత్తునూరు గ్రామంలో మంగళవారం ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని నిర్వహించారు. కరీంనగర్‌ లోని రేకుర్తి హాస్పిటల్ జగిత్యాల పార్థ హాస్పిటల్ వైద్యులు సంయుక్తంగా ఈ శిబిరాన్ని నిర్వహించి గ్రామస్తులకు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జగిత్యాల మాజీ మున్సిపల్ చైర్పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సమాజంలోని అట్టడుగు వర్గాలకు లయన్స్ క్లబ్ అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని పేర్కొన్నారు.ముఖ్యంగా అంధత్వ నివారణే...