navageetam.com
Newspaper Banner
Date of Publish : 25 March 2026, 2:33 am Digital Edition : NAVAGEETAM DAILY NEWS

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నేత్ర వైద్య శిబిరం

నవగీతం, మల్లాపూర్:

మల్లాపూర్ మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో  శ్రీ కనకసోమేశ్వర లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మంగళవారం  ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా అధ్యక్షులు రేవెల్లి తిరుపతి మాట్లాడుతూ ..పేద ప్రజలకు ఉచిత నేత్రవైద్య శిబిరాలు నిర్వహిస్తూ ప్రజలకు సేవ చేయడం పేద విద్యార్థులకు పుస్తకాల పంపిణీ కార్యక్రమం నిర్వహించమని అన్నారు. ఈ ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన వచ్చిందని సుమారు 150 మంది కంటి వైద్య శిబిరానికి హాజరుకాగా 60 మందిని కంటి వైద్య శిబిరానికి పంపించామని తెలిపారు.ఈ కార్యక్రమంలో మల్లాపూర్ మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ చిట్యాల లక్ష్మణ్, ఉప సర్పంచ్ గడ్డం సోమారెడ్డి,ఎస్సై అనిల్, మెట్ పల్లి లయన్స్ క్లబ్ అధ్యక్షులు శ్రీనివాసరావు, నాగేష్ రెడ్డి  ముద్దం ప్రసాద్ గౌడ్ ఏనుగు వెంకట్ రెడ్డి రుద్ర రాంప్రసాద్ మండ స్వామి కార్తీక్ గౌడ్ రంగురామా గౌడ్,నవీన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.