లేగ దూడపై పులి దాడి

అప్రమత్తంగా ఉండాలని అటవీ అధికారుల హెచ్చరిక నవగీతం,కొడిమ్యాల: జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలోని గంగారం తండా, గ్రామానికి చెందిన తేజావత్ నరహరి వ్యవసాయ పొలంలో పులి దాడి చేసి లేగ దూడను చంపిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. దమ్మయ్యపేట శివారులో ఉన్న నరహరి పొలం వద్ద ఈ ఘటన జరిగినట్లు గ్రామస్తులు తెలిపారు.సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు ఘటన స్థలానికి చేరుకుని పరిసరాలను పరిశీలించారు. పులి దాడి చేసినట్లు ప్రాథమికంగా గుర్తించిన అధికారులు బాధితుడు తేజావత్ నరహరికి తక్షణ సహాయంగా రూ.5,000...