navageetam.com
Newspaper Banner
Date of Publish : 12 March 2026, 7:44 am Digital Edition : NAVAGEETAM DAILY NEWS

వార్డు సమస్యల పరిష్కారానికి నిధులు మంజూరు చేయాలి

నవగీతం, మెట్ పల్లి టౌన్:

మెట్ పల్లి పట్టణంలోని 25 వ వార్డులో నెలకొన్న వివిధ సమస్యలను పరిష్కరించడానికి వార్డు అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేయాలని 25 వ వార్డు కౌన్సిలర్ అస్రా ఫర్హీన్ జావీద్ మునిసిపల్ కమిషనర్ కి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా  మాట్లాడుతూ.. ఎండాకాలం దృష్ట్యా వార్డులో బోర్‌వెల్‌ల మరమ్మతులు, కొత్త బోర్ వెల్ నిర్మాణానికి,వార్డులో ఉన్న పాత నాలుగు బోర్‌వెల్‌లు ప్రస్తుతం పనికిరాకుండా పాడైపోయాయని అందువల్ల వార్డు ప్రజలు తీవ్రంగా తాగునీటి సమస్యను ఎదుర్కొంటున్నారు.అలాగే వార్డులో కొత్తగా ఆరు బోర్‌వెల్‌లు అవసరం ఉంది. ప్రస్తుతం నీటి సమస్య చాలా ఎక్కువగా ఉండటంతో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు.అందువల్ల పాడైన నాలుగు బోర్‌వెల్‌లను మరమ్మతు చేయుటకు మరియు కొత్తగా ఆరు బోర్‌వెల్‌ల ఏర్పాటుకు అవసరమైన నిధులను వీలైనంత త్వరగా మంజూరు చేయవలసిందిగా కోరారు. అలాగే వీధి కుక్కల సమస్య విపరీతంగా ఉన్నందున స్కూల్ పిల్లలకు వచ్చే పోయే వారు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్యని తొందరగా పరిష్కరించాలని కమిషనర్ ని కోరారు. ఈ కార్యక్రమంలో 25 వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్. అస్ర ఫర్హీన్. జావిద్ సాదిక్, శ్రీను. ప్రవీణ్ హాజీ. సాజిద్ బేగ్ సోహెల్ ఆరిఫ్ ముజ్జు తదితరులు నాయకులు పాల్గొన్నారు.