విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవానికి ఆహ్వానం.

నవగీతం, మల్లాపూర్: మల్లాపూర్ మండలం మొగిలిపేట గ్రామంలో కోటిలింగేశ్వర స్వామి దేవస్థానంలో ఈనెల 13న ప్రారంభం కానున్న స్వామివారి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమానికి హాజరు కావాలని కోరారు. ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు సోమవారం బీజేపీ నాయకులు డాక్టర్ రఘును కలిసి ఈ సందర్భంగా ఆహ్వాన పత్రికను అందజేశారు. ఆలయ అభివృద్ధి కోసం డాక్టర్ రఘు రూ. 10 వేల విరాళాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ చైర్మన్ చిట్యాల శ్రీధర్, కోశాధికారి దూలూరి ప్రభాకర్ రెడ్డి, దండవేని నర్సయ్య, వీడీసీ...