విచ్చల విడిగా పార్కింగ్ – రోడ్లపైనే నిలుపుతున్న వాహనాలు

ట్రాఫిక్ తో ప్రజల ఇబ్బందులు -పట్టించుకోని అధికారులు నవగీతం,జగిత్యాల ప్రతినిధి: జగిత్యాల జిల్లా మెట్‌పల్లి పట్టణంలో ట్రాఫిక్ సమస్య రోజురోజుకూ తీవ్రమవుతోంది. ముఖ్యంగా విచ్చలవిడిగా పార్కింగ్ చేయడం వల్ల పట్టణంలోని ప్రధాన రహదారులు కుదించుకుపోతున్నాయి. వ్యాపార కేంద్రాలు, మార్కెట్ ప్రాంతాలు, ప్రభుత్వ కార్యాలయాల వద్ద వాహనదారులు నియమాలను పట్టించుకోకుండా రోడ్లపైనే వాహనాలను నిలిపివేస్తున్నారు. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది.రోడ్లపైనే వాహనాలు నిలిపివేయడం వల్ల ఒకే లైన్‌లోనే వాహనాలు వెళ్లాల్సి వస్తోంది. దీంతో ట్రాఫిక్ జామ్‌లు సాధారణంగా మారిపోయాయి. పీక్ అవర్స్‌లో పరిస్థితి మరింత...