navageetam.com
Newspaper Banner
Date of Publish : 13 March 2026, 2:14 am Digital Edition : NAVAGEETAM DAILY NEWS

విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్స్,పెన్నుల పంపిణీ

నవగీతం, మెట్ పల్లి:

మెట్ పల్లి పట్టణంలోని 15వ వార్డు చావిడి వద్ద ఉన్న ఉర్దూ మీడియం పాఠశాలలో చదువుతున్న 10వ తరగతి విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్స్, పెన్నులు పంపిణీ చేశారు. త్వరలో ప్రారంభం కానున్న 10వ తరగతి వార్షిక పరీక్షలను దృష్టిలో ఉంచుకుని 15వ వార్డు కౌన్సిలర్ అరిగెల అనూష-రాకేష్ సైనిక్ ఫౌండేషన్‌తో కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సైనిక్ ఫౌండేషన్ ఉపాధ్యక్షుడు అరిగెల రాకేష్ మాట్లాడుతూ విద్య నేటి సమాజంలో ఎంతో ముఖ్యమని, విద్య ద్వారా సమాజంలో గౌరవం లభిస్తుందని తెలిపారు. విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా ఆత్మవిశ్వాసంతో, ప్రణాళికాబద్ధంగా చదివి మంచి ఫలితాలు సాధించాలని సూచించారు. అలాగే రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం విద్యార్థులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అరిగెల రాకేష్‌తో పాటు పాఠశాల యాజమాన్యం, ఇతరులు పాల్గొన్నారు.