విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్స్,పెన్నుల పంపిణీ
నవగీతం, మెట్ పల్లి: మెట్ పల్లి పట్టణంలోని 15వ వార్డు చావిడి వద్ద ఉన్న ఉర్దూ మీడియం పాఠశాలలో చదువుతున్న 10వ తరగతి విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్స్, పెన్నులు పంపిణీ చేశారు. త్వరలో ప్రారంభం కానున్న 10వ తరగతి వార్షిక పరీక్షలను దృష్టిలో ఉంచుకుని 15వ వార్డు కౌన్సిలర్ అరిగెల అనూష-రాకేష్ సైనిక్ ఫౌండేషన్‌తో కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సైనిక్ ఫౌండేషన్ ఉపాధ్యక్షుడు అరిగెల రాకేష్ మాట్లాడుతూ విద్య నేటి సమాజంలో ఎంతో ముఖ్యమని, విద్య ద్వారా సమాజంలో గౌరవం...