navageetam.com
Newspaper Banner
Date of Publish : 07 March 2026, 11:00 am Digital Edition : NAVAGEETAM DAILY NEWS

విద్యార్థులకు పరీక్షా ప్యాడ్లు, పెన్నుల పంపిణీ

నవగీతం, జగిత్యాల ప్రతినిధి:

నిత్యసాయి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న పదో తరగతి విద్యార్థులకు శనివారం పరీక్షా ప్యాడ్లు, పెన్నులను పంపిణీ చేశారు. త్వరలో జరగబోయే పదవ తరగతి వార్షిక పరీక్షలకు హాజరుకానున్న విద్యార్థులకు నిత్యసాయి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పరీక్ష ప్యాడ్లు, పెన్నులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ కోరుట్ల ఇంచార్జీ సుమ మాట్లాడుతూ ట్రస్ట్ ఫౌండర్ డాక్టర్ రఘు చిట్నేని ఆధ్వర్యంలో సుమారు పాతిక సంవత్సరాలుగా ట్రస్ట్ ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో సేవా కార్యక్రమాలను మరింత విస్తరిస్తామని పేర్కొన్నారు. ట్రస్టు సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సిబ్బంది వినీత, పాఠశాల ప్రధానోపాధ్యాయులు నరసింహమూర్తి, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.