విద్యుత్ అంతరాయాల నివారణకు ఈఆర్టీ వాహనాలు: ఎస్ఈ వెల్లడి
నవగీతం, జగిత్యాల: ప్రకృతి విపత్తులైన భారీ వర్షాలు, ఈదురు గాలులు, సాంకేతిక కారణాల వల్ల విద్యుత్ సరఫరాలో ఏర్పడే అంతరాయాలను తగ్గించి వినియోగదారులకు త్వరితగతిన సేవలు అందించేందుకు జగిత్యాల సర్కిల్ సూపెరింటెండింగ్ ఇంజనీర్ బి. సుదర్శనం ప్రత్యేక చర్యలు చేపట్టామని తెలిపారు. ఈ మేరకు సర్కిల్ పరిధిలో ERT , Emergency Restoration Team – (ఎమర్జెన్సీ రీస్టోరేషన్ టీమ్) మూడు వాహనాలను, టీం ను కూడా వినియోగిస్తున్నామని వెల్లడించారు. అదేవిధంగా సబ్‌డివిజన్ స్థాయిలో 9 వాహనాలను సిద్ధంగా ఉంచి అత్యవసర పరిస్థితుల్లో వినియోగిస్తున్నామని...