navageetam.com
Newspaper Banner
Date of Publish : 31 March 2026, 4:11 pm Digital Edition : NAVAGEETAM DAILY NEWS

విద్యుత్ భద్రతా నియమాలు తప్పనిసరిగా పాటించాలి: ఏడీఈ అమరేందర్

గుండంపల్లి  గ్రామంలో విద్యుత్ ప్రజా బాట

నవగీతం, మల్లాపూర్:

మల్లాపూర్ మండలం గుండంపల్లి గ్రామంలో విద్యుత్ ప్రజా బాట కార్యక్రమాన్ని విద్యుత్ ఏ డి ఈ జక్కుల అమరేందర్ ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ సందర్భంగా ఏ డి ఈ అమరేందర్ మాట్లాడుతూ…ప్రతి ఒక్కరూ విద్యుత్ భద్రతా నియమాలు తప్పనిసరిగా పాటించాలని, ట్రాన్స్‌ఫార్మర్ ఫ్యూజ్‌లను స్వయంగా మార్చేందుకు ప్రయత్నించకూడదని, ఏదైనా సమస్య వచ్చినప్పుడు వెంటనే విద్యుత్ సిబ్బందికి సమాచారం ఇవ్వాలని తెలిపారు. అలాగే వ్యవసాయ మోటర్లకు కెపాసిటర్లు తప్పనిసరిగా అమర్చుకోవాలని రైతులకు సూచించారు.అలాగే గుండంపల్లి గ్రామంలో చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న ముఖ్య సమస్యకు పరిష్కారం లభించింది. పోచమ్మ దేవాలయం నుండి వైకుంఠ ధామం వరకు విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేసి, వీధి దీపాలు వెలిగే విధంగా లైన్ ఏర్పాటు చేయడం జరిగింది.ఈ సమస్య పరిష్కారంపై సర్పంచ్  గ్రామ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తూ విద్యుత్ శాఖకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ దప్పుల పద్మ నర్సయ్య మార్కెట్ చైర్మన్ అంత డుపుల పుష్పలత నర్సయ్య, రాఘవపేట సెక్షన్ ఏ ఈ సిరిపురం సంతోష్ కుమార్ ,సీనియర్ లైన్ ఇన్స్పెక్టర్ రవీందర్, లైన్ ఇన్స్పెక్టర్ శ్రీధర్, లైన్ మెన్ లక్ష్మణ్, ఏ ఎల్ ఎం వినిత్, ఉప సర్పంచ్ గంగాధర్, మామిడి లక్ష్మారెడ్డి, జక్కుల కొమురయ్య, గంగారెడ్డి,గంగాధర్, విజయ్, నరేష్, అంజయ్య, రాజేందర్, మిద్దె అంజయ్య, అనిల్,వి డి సి సభ్యులు గ్రామస్తులు పాల్గొన్నారు