ఈనెల 28న వీర హనుమాన్ విజయయాత్ర విజయవంతం చేయండి
నవగీతం, జగిత్యాల ప్రతినిధి:
జగిత్యాల పట్టణంలోని విశ్వహిందూ పరిషత్ కార్యాలయంలో ఈ నెల 28 శనివారం రోజున జరిగే వీరహనుమాన్ విజయయాత్ర కరపత్రాన్ని జిల్లా అధ్యక్షులు బోయిని పద్మాకర్ ఉపాధ్యక్షులు గడ్డం వేణుగోపాల్ రెడ్డి గార్ల చేతుల మీదుగా కరపత్రాలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విశ్వహిందూ పరిషత్ నగర అధ్యక్షులు జిట్టవేణి అరుణ్ కుమార్ మాట్లాడుతూ ఈనెల 28 శనివారం రోజున స్థానిక మడలేశ్వర స్వామి ఆలయం నుండి మంచినీళ్ళ బావి టవర్ సర్కిల్ తహసిల్ చేరస్తా జంబి గద్దె వరకు వీర హనుమాన్ విజయాత్ర జరుగునని, ఈ యాత్రలో హిందూ బంధువులు పార్టీలకు అతీతంగా పాల్గొని విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరు కూడా హిందూ సంఘటితం కొరకే ఈ వీర హనుమాన్ విజయాత్రలో పాల్గొని హిందువుల ఐలోక్యతను చాటాలని వారు కోరారు.ఈ కార్యక్రమములో జిల్లా సహా కార్యదర్శి గాజోజు సంతోష్ కుమార్, కోశాధికారి మామిడాల రాములు, బజరంగదళ్ నగర సంయోజక్ కనికరపు విశ్వనాథ్, నగర కార్యదర్శి వడ్లగట్ట భూమేష్, సత్సంగ్ ప్రముక్ అనుపురం శ్రీధర్, సేవా ప్రముక్ రాజేంద్రప్రసాద్, శైలజ, పద్మ, భారత్ సురక్ష సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏ సి ఎస్ రాజు, అంకరి సుధాకర్ వేముల సంతోష్ కౌన్సిలర్స్ ఆరువ లక్ష్మి, నాగరాజు, శ్రీనివాస్, శ్రీధర్, కోరుకంటి సాయి, బిట్టు, రాజేందర్, అనిల్, చిరంజీవి, వెంకటేష్, బడే శంకర్, బిక్షపతి, హిందూ బంధువులు అందరూ పాల్గొన్నారు