సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
నవగీతం,చొప్పదండి:
చొప్పదండి మండల కేంద్రంలో వివిధ కార్యక్రమాల్లో భాగంగా మండల పరిషత్ కార్యాలయంలో సర్పంచులు, పంచాయితీ కార్యదర్శులు మరియు మండల ఉన్నతాధికారుల సమీక్ష సమావేశానికి చొప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యం హాజరై రాబోవు వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని గ్రామాలలో నీటి ఎద్దడి రాకుండా చూసుకోవాలని దిశా నిర్దేశం చేశారు. గ్రామాల వారీగా మంజూరైన ఉపాధి హామీ సీసీ రోడ్లు, అంగన్వాడీ కేంద్రాలు, గ్రామ పంచాయతీ భవనాలు, మహిళా సంఘ భవనాలను తొందరగా పూర్తి చేయాలని కోరారు. రాబోవు రోజుల్లో కూడా మండలానికి అధిక నిధులు మంజూరు చేసి అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.

అనంతరం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నందు మండలంలోని 60 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి-షాది ముబారక్ చెక్కులను పంపిణీ చేసి చొప్పదండి వ్యవసాయ మార్కెట్ యార్డులో ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కందుల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఇట్టి కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ వడ్లూరి సరిత, వైస్ చైర్ పర్సన్ పెరుమాండ్ల మానస, మార్కెట్ ఛైర్మన్ కొత్తూరు మహేష్, మండల కాంగ్రెస్ నాయకులు వివిధ గ్రామాల సర్పంచులు, పంచాయితీ కార్యదర్శులు,అధికారులు తదితరులు పాల్గొన్నారు