వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని నీటి ఎద్దడి రాకుండా చూడాలి
సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం నవగీతం,చొప్పదండి: చొప్పదండి మండల కేంద్రంలో వివిధ కార్యక్రమాల్లో భాగంగా మండల పరిషత్ కార్యాలయంలో సర్పంచులు, పంచాయితీ కార్యదర్శులు మరియు మండల ఉన్నతాధికారుల సమీక్ష సమావేశానికి చొప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యం హాజరై రాబోవు వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని గ్రామాలలో నీటి ఎద్దడి రాకుండా చూసుకోవాలని దిశా నిర్దేశం చేశారు. గ్రామాల వారీగా మంజూరైన ఉపాధి హామీ సీసీ రోడ్లు, అంగన్వాడీ కేంద్రాలు, గ్రామ పంచాయతీ భవనాలు, మహిళా సంఘ భవనాలను తొందరగా పూర్తి చేయాలని కోరారు....