వైద్యం ఖర్చుల కోసం సాయం అందజేత
నవగీతం, కరీంనగర్: కరీంనగర్ లోని డాక్టర్ బి ఆర్ అంబెడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ రీజనల్ కోఆర్డినేటర్ సెంటర్ లో ఆఫీసు అసిస్టెంట్ పని చేస్తున్న రాజు తల్లి అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతుండగా, ఆమెకు మెరుగైన వైద్యం కోసం సాయం అందించాలని సోషల్ మీడియా వేదికగా అభ్యర్థించారు. దీంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ రీజినల్ కోఆర్డినేటర్ పరిధిలోని పలువురు విద్యార్థులు తలో కొంత అందించారు. దీంతో సమకూరిన నగదును ఆదివారం నాడు కరీంనగర్ కోఆర్డినేటర్ కార్యాలయంలో కోఆర్డినేటర్ సత్య...