వైభవంగా స్వామివారి ఉత్సవ విగ్రహాల ఊరేగింపు
నవగీతం,మెట్ పల్లి : మెట్ పల్లి మండలం మేడిపల్లి గ్రామం శుక్రవారం జరగనున్న శ్రీరామనవమి వేడుకలకు సర్వం సిద్ధమైంది. గురువారం ఉదయం గ్రామంలోని సీతారాముల ఉత్సవ విగ్రహాలను అత్యంత వైభవంగా, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయానికి ఊరేగింపుగా తరలించారు.భక్తులు జై శ్రీరామ్ నినాదాలతో గ్రామ పురవీధుల గుండా మేళతాళాలతో సాగిన ఈ ఊరేగింపులో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మహిళలు మంగళ హారతులతో స్వామివారికి స్వాగతం పలకగా, ఆంజనేయ స్వామి మాల వేసుకున్న భక్తులు సందడి చేశారు. జై శ్రీరామ్...