navageetam.com
Newspaper Banner
Date of Publish : 19 March 2026, 7:31 am Digital Edition : NAVAGEETAM DAILY NEWS

వైష్ణవి హత్య కేసులో ముగ్గురు రిమాండ్

నవగీతం, జగిత్యాల/కోరుట్ల :

జిల్లాలో సంచలనం సృష్టించిన కోరుట్ల మండలం మాధాపూర్ గ్రామానికి చెందిన గంధం వైష్ణవి (20) గర్భిణీ హత్య కేసులో భర్తతోపాటు మరో ముగ్గురిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు మెట్ పల్లి డిఎస్పి రాములు తెలిపారు.. వివరాల ప్రకారం మాధాపూర్ గ్రామానికి చెందిన గంధం వైష్ణవి (20) హత్య కేసులో పోలీసుల దర్యాప్తు వేగవంతంగా కొనసాగుతోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు చిత్తారి హరిబాబు తన భార్యను కట్నం వేధింపుల నేపథ్యంలో హత్య చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. దర్యాప్తులో భాగంగా నిందితుడు హరిబాబుకు సహకరించి, బాధితురాలిని కట్నం కోసం మానసికంగా మరియు శారీరకంగా వేధించినట్లు తెలిసిన చిత్తారి లక్ష్మి (తల్లి), చిత్తారి ఆనంద్ (అన్న), చిత్తారి అశోక్ (అన్న) వారి పై కట్న వేధింపులు,హత్యకు ప్రేరేపించిన ఆరోపణలపై కేసు నమోదు చేసి మెట్ పల్లి డిఎస్పి ఏ.రాములు ఆదేశాల మేరకు, ఎస్సై చిరంజీవి దర్యాప్తు చేపట్టి,ఈ కేసులో నిందితులు అయిన చిత్తారి లక్ష్మి ,చిత్తారి ఆనంద్, చిత్తారి అశోక్ వారిని గురువారం  అరెస్ట్ చేసి, డిఎస్పి ముందు హాజరుపరచగా, డిఎస్పి వారిని న్యాయస్థానం ఎదుట హాజరుపరచి రిమాండ్‌కు తరలించడం జరిగిందని తెలిపారు.