వైష్ణవి హత్య కేసులో ముగ్గురు రిమాండ్
నవగీతం, జగిత్యాల/కోరుట్ల : జిల్లాలో సంచలనం సృష్టించిన కోరుట్ల మండలం మాధాపూర్ గ్రామానికి చెందిన గంధం వైష్ణవి (20) గర్భిణీ హత్య కేసులో భర్తతోపాటు మరో ముగ్గురిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు మెట్ పల్లి డిఎస్పి రాములు తెలిపారు.. వివరాల ప్రకారం మాధాపూర్ గ్రామానికి చెందిన గంధం వైష్ణవి (20) హత్య కేసులో పోలీసుల దర్యాప్తు వేగవంతంగా కొనసాగుతోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు చిత్తారి హరిబాబు తన భార్యను కట్నం వేధింపుల నేపథ్యంలో హత్య చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. దర్యాప్తులో...