సామాజిక అంశాలపై పోలీస్ కళాబృందం చే అవగాహన

నవగీతం, జగిత్యాల/బీర్పూర్ జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు బీర్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రంగ సాగర్ గ్రామంలో పోలీస్ కళాబృందం వారు మూఢ నమ్మకాలు, ఆత్మహత్యల నివారణ, రోడ్డు ప్రమాదాలు ట్రాఫిక్ నియమాలు, గల్ఫ్ ఏజెంట్ల మోసాలు, సైబర్ మోసాలు,నివారణ పై, సీసీ కెమెరాల యొక్క ఆవశ్యకత గురించి ప్రజలకు అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా ఎస్.ఐ రాజు మాట్లాడుతూ.. ఈ మధ్యకాలంలో సైబర్ నేరాలు విపరీతంగా పెరుగుతున్నాయని, సైబర్ నేరగాళ్ల మాయ మాటలు నమ్మి మోసపోవద్దని, ఎవరైనా మోసపోయినట్టైతే 1930 నంబర్ కి...