సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం

సాహితీ వేత్తల సమ్మేళనం నవగీతం, హైదరాబాద్: తెలంగాణ సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో ఆదివారం రవీంద్ర భారతి కాన్ఫరెన్స్ హాలులో 'అంతర్జాతీయ మహిళా దినోత్సవం' కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి సభాధ్యక్షత వహించిన అకాడమీ కార్యదర్శి నామోజు బాలాచారి మాట్లాడుతూ ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని అకాడమీ తరఫున నిర్వహిస్తున్నామన్నారు. ఈ సంవత్సరము సభను 'థీమ్' ప్రకారంగా మూడు సదస్సులుగా విభజించి నిర్వహిస్తున్నామన్నారు. మొదటి సదస్సు "స్త్రీవాద సాహిత్యం దశ - దిశ" రెండవది 'ఆధునిక...