సైబర్ మోసలకు గురైతే వెంటనే 1930కి ఫిర్యాదు చేయాలి
సైబర్ క్రైమ్ డిఎస్పి వెంకటరమణ నర్సింగ్ విద్యార్థినులకు సైబర్ నేరాల నివారణ పై అవగాహన నవగీతం, జగిత్యాల ప్రతినిధి: జగిత్యాల పట్టణంలోని ప్రభుత్వ మహిళా నర్సింగ్ కళాశాలలో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సైబర్ క్రైమ్ డీఎస్పీ వెంకటరమణ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థినులకు సైబర్ భద్రతపై సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా డిఎస్పి మాట్లాడుతూ.. మహిళలు, ముఖ్యంగా విద్యార్థినులు సోషల్ మీడియా వేదికల ద్వారా జరుగుతున్న వివిధ రకాల మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. సైబర్ స్టాకింగ్, సైబర్ బుల్లీయింగ్...