సోదరభావంతో మెలగడమే రంజాన్ సందేశం
బీసీ జేఏసీ జిల్లా చైర్మన్ దాసరి ఉష. నవగీతం, పెద్దపల్లి: పవిత్ర రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని పెద్దపల్లి పట్టణంలోని చందపల్లి ప్రాంతంలో గల ఈద్గా వద్ద పండుగ వేడుకలు అత్యంత భక్తిశ్రద్ధలతో, వైభవంగా నిర్వహించారు.ఈ సందర్భంగా బీసీఏసీ జిల్లా చైర్మన్ దాసరి ఉష ఈద్గాను సందర్శించి,అక్కడ ప్రత్యేక ప్రార్థనలు ముగించుకున్న ముస్లిం సోదరులను స్వయంగా కలిసి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రంజాన్ పండుగ క్రమశిక్షణకు, దాతృత్వానికి మరియు మత సామరస్యానికి గొప్ప నిదర్శనమని పేర్కొన్నారు.నెల రోజుల పాటు కఠిన ఉపవాస...