నవగీతం, హైదరాబాద్:
సికింద్రాబాద్ పద్మారావునగర్ లో ప్రసిద్ధిగాంచిన స్కంధగిరి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానంలో ఉగాది పర్వదినం సందర్భంగా డాక్టర్ హేమ రఘు దంపతులు స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ హేమ రఘు మాట్లాడుతూ…కోరుట్ల నియోజకవర్గ ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ ప్రజలందరూ సుఖ శాంతులతో ఉండాలని కోరుకున్నారు. ఉగాది పర్వదినం సందర్భంగా ఆలయం భక్తులతో కళకళలాడింది.పూజా కార్యక్రమాలు వేద మంత్రోచ్చారణల మధ్య అత్యంత వైభవంగా సాగాయి. గ్రహ దోషాలు, కుజ దోషాలను తొలగించే శక్తివంతమైన ప్రదేశంగా భక్తుల విశ్వాసం. ఇక్కడ శ్రీ వల్లి, దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామితో పాటు గణపతి, శివుడు, దుర్గామాత, నవగ్రహాలు పూజలందుకుంటాయి. భక్తులు ప్రత్యేక అర్చనలు, అభిషేకాలు నిర్వహించి దేవునికి నైవేద్యాలు సమర్పించారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారిని దర్శనం చేసుకొని ఆశీస్సులు పొందారు.
