navageetam.com
Newspaper Banner
Date of Publish : 30 March 2026, 3:48 am Digital Edition : NAVAGEETAM DAILY NEWS

హనుమాన్ స్వాములకు ముస్లిం యువకుడు అన్న ప్రసాద వితరణ

నవగీతం, కోరుట్ల ప్రతినిధి:

కోరుట్ల మండలం ధర్మారం గ్రామంలో హనుమాన్ దీక్ష స్వాములకు షేక్ సలీం అనే ముస్లిం యువకుడు అన్న ప్రసాదం పంపిణీ చేసి నేటి సమాజానికి ఆదర్శంగా నిలిచాడు అనంతరం సలీం మాట్లాడుతూ మతసామరస్యానికి ప్రతీకగా భావించే మన భారత దేశంలో హిందూ ముస్లిం తేడా లేకుండా ప్రతి ఒక్కరూ సోదర భావంతో మెలగాలని తద్వారా దేశమంతా ఒకటే అనే భావన నెలకొల్పపడుతుందని రంజాన్ లాంటి మాసంలో ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేసిన హిందూ యువకులే నాకు ఆదర్శం అని అందుకే ప్రతి సంవత్సరం హనుమాన్ దీక్ష స్వాములకు అన్నప్రసాదం పంపిణీ చేస్తున్నట్లు వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ దొడ రంజిత్ రెడ్డి ఉప సర్పంచ్ మారాసి గణేష్ ఆదిరెడ్డి అంజన్న తదితరులు పాల్గొన్నారు