navageetam.com
Newspaper Banner
Date of Publish : 30 March 2026, 3:37 am Digital Edition : NAVAGEETAM DAILY NEWS

హెచ్పివి వ్యాక్సినేషన్ పై అపోహలు వద్దు.. డాక్టర్ పి సింధుజ

నవగీతం, కోరుట్ల ప్రతినిధి:

కథలాపూర్ మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సోమవారం రోజున కేంద్రప్రభుత్వం అందిస్తున్న ఉచిత హెచ్ పి వి వ్యాక్సినేషన్ పంపిణీ ని వైద్యాధికారిని డా. సింధూజ,ఎంపిడివో శంకర్ సర్పంచ్ న్యావనంది శేఖర్, ఉప సర్పంచ్ ప్రసాద్, నాయకులు ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ పి సింధుజ మాట్లాడుతూ.. వ్యాక్సిన్ ఆడవారిలో భవిష్యత్తులో సర్వైకల్ క్యాన్సర్ రాకుండా ఉంటుందన్నారు. 14,15 సంవత్సరాల ఆడపిల్లలకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు వ్యాక్సినేషన్ పూర్తిగా ఆన్లైన్ లో నమోదు అయి వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ ఇవ్వడం జరుగుతుందన్నారు.ఈ వ్యాక్సినేషన్ ద్వారా ఎలాంటి దుష్పరిణామాలు ఉండవన్నారు. 26 మంది బాలికలకు హెచ్ పి వి వ్యాక్సినేషన్ చేశామని తెలిపారు. గ్రామాలలో అపోహలకు తావివ్వకుండా అర్హులైన పిల్లలందరూ వ్యాక్సినేషన్ తీసుకోవాల్సిందిగా సూచించారు.కార్యక్రమంలో వైద్యాధికారిని సింధూజ, ఎంపిడిఓ శంకర్, సిఎచ్ఓ వేణుగోపాల్, సర్పంచ్ న్యావనంది శేఖర్,ఉప సర్పంచ్ చెట్ పల్లి ప్రసాద్ వైద్య సిబ్బంది పాల్గొన్నారు.