హోలీ పండుగను సురక్షితంగా జరుపుకోవాలి: ఎస్పి అశోక్ కుమార్
డ్రంక్ అండ్ డ్రైవ్, మైనర్ డ్రైవింగ్ పై ప్రత్యేక దృష్టి నవగీతం, జగిత్యాల ప్రతినిధి: జగిత్యాల జిల్లా ప్రజలు హోలీ పండుగను ఆనందభరితంగా, సురక్షిత వాతావరణంలో జరుపుకోవాలని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ సూచించారు. హోలీ వేడుకల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీస్ శాఖ తరఫున భద్రతా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ముఖ్యంగా యువకులు అత్యుత్సాహం ప్రదర్శించకుండా ద్విచక్ర వాహనాలపై ర్యాష్ డ్రైవింగ్ చేయరాదని, స్టంట్లు చేయడం, ముగ్గురు లేదా నలుగురు ఒకే వాహనంపై ప్రయాణించడం, బైక్‌లకు సైలెన్సర్ తొలగించి నడపడం...