నవగీతం,మల్లాపూర్ ప్రతినిధి
మల్లాపూర్ మండలంలోని గుండపల్లి గ్రామంలో అంగన్వాడి కేంద్రంలో పోషణ పక్వాడ లో భాగంగా గర్భిణీ మహిళలు, బాలింతలు మరియు 0-5 సంవత్సరాల పిల్లల తల్లుల కోసం పోషకాహారంపై అవగాహన కార్యక్రమంలో.భాగంగా వైద్య సిబ్బంది మరియు అంగన్‌వాడీ సిబ్బంది సమతుల్య ఆహారం ప్రాముఖ్యత, గర్భిణీలకు అవసరమైన పోషకాహారం, బాలింతల ఆరోగ్య సంరక్షణ 0-5 సంవత్సరాల పిల్లల పోషణ ఎదుగుదల అనీమియా నివారణ ఆరోగ్య మార్గదర్శకాలు సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ దప్పుల పద్మ నర్సయ్య చేతుల మీదుగా కోడిగుడ్లు బాలామృతం పౌష్టికాహారం అందజేశారు ఈ కార్యక్రమంలో గర్భిణీలు, బాలింతలు మరియు చిన్న పిల్లల తల్లులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.