navageetam.com
Newspaper Banner
Date of Publish : 18 April 2026, 5:50 pm Digital Edition : NAVAGEETAM DAILY NEWS

అంగన్వాడీ కేంద్రంలో గ్రాడ్యుయేషన్ డే

నవగీతం, కరీంనగర్:

పోషణ పక్వాడలో భాగంగా మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కరీంనగర్ అర్బన్ ప్రాజెక్ట్,సంతోష్ నగర్ సెక్టార్, ముకురాంపుర 3వ అంగన్వాడీ కేంద్రంలో ప్రీ స్కూల్ పిల్లలకు గ్రాడ్యుయేషన్ డే మరియు పిల్లల తల్లిదండ్రులకు మొబైల్ ఫోన్ ల వాడకం మరియు జంక్ ఫుడ్ వాళ్ళ కలిగే నష్టాల గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో సిడిపిఓ సబిత మాట్లాడుతూ.. ప్రీ స్కూల్ పిల్లల గ్రాడ్యుయేషన్ డే కి హాజరు కావడం సంతోషoగా ఉంది అని వాళ్ళు నేర్చుకున్న ఆటపాటలు చక్కగా చూపించారు .ప్రతిరోజు అంగన్వాడి కేంద్రానికి వచ్చే పిల్లలు చాలా చురుకుగా ఉంటారు అని అన్నారు 80% బ్రెయిన్ డెవలప్మెంట్ ఈ వయసులో పిల్లల్లో ఎక్కువగా ఉంటుంది అని అంగన్వాడీ నిర్వహించే ప్రీ స్కూల్ కార్యక్రమాల వాళ్ళ పిల్లలు బ్రెయిన్ డెవలప్మెంట్, శారీరక ఎదుగుదలకు ఎంతగానో ఉపయోగంగా ఉంటుంది అన్నారు.ఈ నిత్య జీవితంలో సమయం లేక పిల్లలకి మొబైల్ ఫోన్లు ఇచ్చి వాళ్ళని మొబైల్ ఫోన్లకి బానిసలయ్యేలా తల్లిదండ్రులు చేస్తున్నారు అని అతిగా మొబైల్ వాడకం మరియు రేడియేషన్ ప్రభావం వల్ల పిల్లల మెదడుపై చాలా చెడు ప్రభావం పడుతుంది అని బయట దొరికే జంక్ ఫుడ్ పిల్లలకు పెట్టడం వలన పిల్లలు ఆరోగ్యo మీద చెడు ప్రభావం ఉంటుంది అన్నారు ఈ కార్యక్రమం లో సిడిపిఓ సబిత, సూపర్వైజర్ నిర్మల, బిసి సతీష్, ప్రతం రాజేందర్, డిహెచ్ఈడబ్ల్యు శ్రీలత, అంగన్వాడీ టీచర్,గర్భిణీ లు, బాలింతలు, పిల్లలు పాల్గొన్నారు.