అంగన్వాడీ కేంద్రంలో పోషక ఆహారం పై అవగాహన

నవగీతం,జగిత్యాల ప్రతినిధి: జగిత్యాల పట్టణ కేంద్రంలోని వార్డు నెంబర్ 32 చింతకుంట వాడ అంగన్వాడీ కేంద్రంలో పోషక ఆహారం ప్రాముఖ్యతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక కౌన్సిలర్ బడుగు పద్మ రాజేందర్ ముఖ్య అతిథిగా హాజరై గర్భిణీ స్త్రీలు బాలింతలు మరియు చిన్నారుల తల్లులకు పోషకాహారం పై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా కౌన్సిలర్ బడుగు పద్మ రాజేందర్ మాట్లాడుతూ, ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి సరైన పోషకాహారం ఎంతో అవసరమని , పిల్లల శారీరక, మానసిక అభివృద్ధికి విటమిన్లు, ప్రోటీన్లు, ఖనిజాలు సమృద్ధిగా...