navageetam.com
Newspaper Banner
Date of Publish : 09 April 2026, 8:31 pm Digital Edition : NAVAGEETAM DAILY NEWS

అంగన్‌వాడీ టీచర్లకు స్మార్ట్‌ఫోన్ల పంపిణీ

నవగీతం,కరీంనగర్ ప్రతినిధి:

.ఎన్.జి.ఓ. భవన్‌లో కరీంనగర్ అర్బన్ ప్రాజెక్ట్ అంగన్‌వాడీటీచర్లకు కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్, యస్ యుడిఎ చైర్మన్ నరేందర్ రెడ్డి చేతుల మీదుగా కొత్త ఫోన్లు పంపిణీ చేసారు. 17 మంది దివ్యంగులకి రెట్రోఫిట్టెడ్ మోటార్ వెహికల్స్ ఇవ్వడం జరిగింది. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా గ్రోత్ డ్రైవ్ నిర్వహించి ఆరోగ్యంగా ఉన్న పిల్లలకి బహుమతి ప్రదానం చేయడమైనది. ఈ నెల 9 నుంచి 23 వరకు జరిగే పోషణ పక్షం కార్యక్రమం ప్రారంభించారు.

ఎమ్మెల్యే మాట్లాడుతూ.. లబ్ధిదారులు అందరూ అంగన్‌వాడీ సేవలు ఉపయోగించుకోవాలని, అంగన్‌వాడీ టీచర్లకు ప్రభుత్వం స్మార్ట్‌ఫోన్లు అందజేసి పారదర్శకమైన సేవలకు నాంది పలికారని అన్నారు. మేయర్ మాట్లాడుతూ పోషణ అభియాన్ యాప్ అమలును సులభతరం చేయడం, డేటా నమోదు ప్రక్రియను వేగవంతం చేయడం ప్రధాన ఉద్దేశ్యం అని తెలిపారు.కరీంనగర్ అర్బన్ ప్రాజెక్ట్‌లో ఉన్న అంగన్‌వాడీ టీచర్లకు శాంసంగ్ మొబైల్ ఫోన్లు కొనుగోలు చేసి పంపిణీ చేశాము అని, ఈ ఫోన్లలో అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లు సర్వే వివరాలు, పిల్లల సమాచారం, గర్భిణీలు, బాలింతల ఆరోగ్య వివరాలను నమోదు చేయగలరని వివరించారు. ఒక్కో ఫోన్ ధర సుమారు రూ. 11,650. ఫోన్లలో 4 జి.బి. ర్యామ్, 64 జి.బి. మెమరీ వంటి ఫీచర్లు ఉన్నాయి. డేటా ఎంట్రీ, యాప్ వినియోగం సులభంగా ఉండేలా ప్రత్యేకంగా ఎంపిక చేశారు అని అన్నారు. పిల్లల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.ఈ కార్యక్రమంలో కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మేయర్ కొలగాని శ్రీనివాస్, యస్ యుడిఏ చైర్మన్ నరేందర్ రెడ్డి, డి.డబ్ల్యూ.ఓ.సరస్వతి,సి.డి.పి.ఓ.సబిత,డి.ఎమ్.హెచ్.ఓ. వెంకట రమణ, సూపర్ వైజర్లు, పోషణ అభియాన్ బి.సి. అంగన్‌వాడీ టీచర్లు పాల్గొన్నారు.