అంగరంగ వైభవంగా.. వాసవి మాత జయంతి వేడుక

నిరుపేద ఆర్యవైశ్య విద్యార్థికి 25 వేల విద్యా ఖర్చుకు వితరణ.. భగవద్గీత పఠనంలో గోల్డ్ మెడల్ సాధించిన మహిళలకు ఘన సన్మానం.. నవగీతం, వైరా ప్రతినిధి: వాసవి కళ్యాణ మండపం వైరా మండల పట్టణ ఆర్యవైశ్య మహాసభ సంయుక్త ఆధ్వర్యంలో ఆర్యవైశ్యుల ఆరాధ్య దైవం.. వాసవి మాత అమ్మవారి జయంతి సందర్భంగా అమ్మవారి విగ్రహానికి అభిషేకాలు, పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. అమ్మవారి జయంతి కార్యక్రమాన్ని అధికారిక పండుగ జాబితాలో చేర్చినందుకుగాను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిపారు. అనంతరం స్థానిక...