navageetam.com
Newspaper Banner
Date of Publish : 22 April 2026, 5:53 pm Digital Edition : NAVAGEETAM DAILY NEWS

అంజన్న క్షేత్రంలో పెద్ద జయంతి ఉత్సవాల ఏర్పాట్లు పరిశీలించిన జగిత్యాల డీఎస్పీ రఘుచందర్

నవగీతం, జగిత్యాల ప్రతినిధి:

జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టు అంజన్న ఆలయంలో మే 10, 11, 12 తేదీలలో వైభవంగా నిర్వహించనున్న పెద్ద జయంతి ఉత్సవాల సందర్భంగా చేపట్టిన ఏర్పాట్లను జగిత్యాల డీఎస్పీ రఘుచందర్ బుధవారం పరిశీలించారు. ఆలయ ఈఓ ఎస్ అంజనారెడ్డితో కలిసి ఆయన ఆలయ పరిసరాల్లోని వివిధ ఏర్పాట్లను సమీక్షించారు.ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. ఉత్సవాలకు భారీ సంఖ్యలో భక్తులు హాజరయ్యే అవకాశం ఉన్నందున వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా సమగ్ర ఏర్పాట్లు చేయాలని సూచించారు. భక్తుల రాకపోకలు, భద్రతా చర్యలు, పార్కింగ్ సదుపాయాలు సక్రమంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.డీఎస్పీ. ఈఓలు అన్నదాన సత్రం, కళ్యాణకట్ట, పార్కింగ్ స్థలాలను పరిశీలించి అవసరమైన సూచనలు చేశారు.ఈ పరిశీలనలో స్థానిక సిఐ నీలం రవి, ఎస్ఐ నరేష్, ఇంచార్జి డీఈ రఘునందన్, ఏఈఓ హరిహరనాథ్, సూపరింటెండెంట్లు సునీల్, చంద్రశేఖర్, స్థానాచారి కపిందర్, ఉపప్రధాన అర్చక చిరంజీవి స్వామి తదితరులు పాల్గొన్నారు.