navageetam.com
Newspaper Banner
Date of Publish : 06 April 2026, 4:33 pm Digital Edition : NAVAGEETAM DAILY NEWS

అంబారిపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో హెచ్పిఓ వాక్సినేషన్ ప్రారంభం

నవగీతం, కోరుట్ల ప్రతినిధి:

కథలాపూర్ మండలం అంబారిపేట (ఓల్డ్) ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో హెచ్ పి ఓ కార్యక్రమ ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించబడింది.ఈ కార్యక్రమం వైద్యాధికారి డా. రచన ఆధ్వర్యంలో జరిగింది. కార్యక్రమాన్ని అంబారిపేట గ్రామ ఉపసర్పంచ్ కరిపె సత్యనారాయణ,ఎంపీడీవో ఎం. శంకర్ సంయుక్తంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు, తల్లిదండ్రులకు మరియు బాలికలకు హెచ్పిఓ వ్యాక్సిన్ యొక్క ప్రాముఖ్యతను వైద్య సిబ్బంది వివరించారు. గర్భాశయ క్యాన్సర్ నివారణలో హెచ్పి ఓ వ్యాక్సిన్ కీలక పాత్ర పోషిస్తుందని, ముఖ్యంగా 14 సంవత్సరాలు పూర్తి చేసి 15 సంవత్సరాలు నిండని బాలికలకు ఈ వ్యాక్సిన్ అందించడం ద్వారా భవిష్యత్తులో క్యాన్సర్ ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించవచ్చని తెలియజేశారు. ఈ క్రమంలో 21 మంది బాలికలకు హెచ్పిఓ వాక్సిన్ ఇవ్వడమైనది.ఇట్టి కార్యక్రమంలో యం పి ఓ రాజశేఖర్, ఆరోగ్య విస్తరణాధికారి తిరుమల శ్రీధర్, పి హెచ్ ఎన్ బి.చంద్రకళ, సూపర్వైజర్ సి హెచ్.జ్యోతి, ఫార్మసిస్ట్ రెహమాన్, స్టాఫ్ నర్స్ రాధ , గ్రామ కార్యదర్శి సరిత మరియు ఏ యన్ యం లు, ఆశా కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.