అంబేద్కర్ ఆశయాలను కొనసాగిద్దాం: కూన గోవర్ధన్

నవగీతం, మెట్ పల్లి ప్రతినిధి: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా మెట్ పల్లి పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద మెట్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కూన గోవర్ధన్ ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా కూన గోవర్ధన్ మాట్లాడుతూ..డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ భారతదేశంలో పుట్టడం మన అందరి అదృష్టమని పేర్కొన్నారు. ఆయన ఒక అద్భుతమైన ప్రతిభాశాలి,విజ్ఞాన గని అని కొనియాడారు. భారత రాజ్యాంగం ద్వారా ప్రజాస్వామ్యానికి బలమైన పునాదులు వేసి, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారతదేశాన్ని నిలబెట్టిన గొప్ప...