నవగీతం,మెట్ పల్లి ప్రతినిధి:
మెట్ పల్లి నిత్యసాయి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కార్యాలయంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ వ్యవస్థాపకులు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.అదేవిధంగా పట్టణంలోని పార్కులో గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.డాక్టర్ రఘు మాట్లాడుతూ అంబేద్కర్ దేశానికి సమానత్వం, న్యాయం, స్వేచ్ఛ వంటి గొప్ప విలువలను అందించిన మహానుభావుడని అన్నారు. ఆయన రూపొందించిన భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి హక్కులను కల్పించిందని పేర్కొన్నారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి అంబేద్కర్ చేసిన సేవలు అమూల్యమని చెప్పారు.ఈ కార్యక్రమంలో నాయకులు చెట్లపల్లి సుఖేందర్ గౌడ్, నల్ల వెంకటేష్, రాజన్న, కోరుట్ల రాజ్, జోగినిపల్లి రవితేజ, వాజిద్ బేగ్, జాపిరి పవన్ కళ్యాణ్, మోతే శ్రీకాంత్, ఎక్కల్ ధనుష్, వచ్చేవాళ్ళ శ్రీకర్, జాపిరి వంశీ తదితరులు పాల్గొన్నారు.