ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు
నవగీతం, మల్లాపూర్ ప్రతినిధి:
భారతరత్న డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా మల్లాపూర్ అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ విగ్రహం దగ్గర జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఎస్సై అనిల్ ,తాసిల్దార్ శ్రీనివాస్,సర్పంచ్ చిట్యాల లక్ష్మణ్ ఉప సర్పంచ్ గడ్డం సోమరెడ్డి , అంబేద్కర్ సంఘ నాయకులు నల్ల లక్పతి, అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ప్రజా ప్రతినిధులు మాట్లాడుతూ.. భారత రాజ్యాంగమును తయారు చేయడంలో కీలక పాత్ర పోషించిన రాజ్యాంగ నిర్మాత భారతరత్న బాబా సాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సేవలను స్మరించుకుంటూ వారు చూపిన బాటలో ప్రతి ఒక్కరు నడవాలని, అంటరానితనంతో కులవివక్షకు గురై కూడా ఉన్నత విద్యను అభ్యసించి దేశం గర్వించే అత్యున్నత స్థాయికి ఎదిగిన అంబేద్కర్ ఆదర్శప్రాయులు. ప్రపంచంలో బలమైన ప్రజాస్వామ్య దేశంగా మన దేశం నిలుస్తోంది అంటే దానికి కారణం ఆయన మనకు ఇచ్చిన రాజ్యాంగం.అంబేద్కర్ ఆశయ సాధనే మన లక్ష్యం కావాలని అన్నారు.ఈ కార్యక్రమంలో తాసిల్దార్ శ్రీనివాస్ ఎస్సై అనిల్ సర్పంచ్ చిట్యాల లక్ష్మణ్ ఉప సర్పంచ్ గడ్డం సోమిరెడ్డి, అంబేద్కర్ సంఘం ఉపాధ్యక్షుడు నల్ల లక్పతి పెద్దిరెడ్డి లక్ష్మణ్ , కొంపెల్లి రాకేష్, మాట్లా సోమయ్య,సంగ గంగరాజాం పుండ్ర శ్రీనివాస్ రెడ్డి, సిరిపురం రవీందర్ మొరపు గంగారాజం ఉయ్యాల లక్ష్మణ్, ఏవిఆర్, వంశి, నర్సయ్య, రాజేశ్వర్ రమేష్ ,నరేష్, రాజం, నర్సయ్య వార్డ్ మెంబర్లు అంబేద్కర్ సంఘం నాయకులు పాల్గొన్నారు