అన్ని వర్గాల ప్రజల కృషితోనే రోడ్డు ప్రమాదాల నివారణ సాధ్యం:జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్

ట్రాఫిక్ నియమాలు పాటిద్దాం...రోడ్డు ప్రమాదాలు నివారిద్దాం: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ నవగీతం,జగిత్యాల ప్రతినిధి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా రోడ్డు ప్రమాదాలను నియంత్రించడం, ప్రజల్లో ట్రాఫిక్ నియమాల పట్ల బాధ్యతాభావం పెంపొందించడం లక్ష్యంగా “Arrive Alive” కార్యక్రమాన్ని ఏప్రిల్ 13 నుండి 18 వరకు జిల్లావ్యాప్తంగా విస్తృతంగా నిర్వహిస్తున్నారు.ఈ కార్యక్రమంలో భాగంగా సోమవారం జగిత్యాల పట్టణంలోని ఓల్డ్ బస్ స్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సత్య...