నవగీతం, మల్లాపూర్ ప్రతినిధి:
మల్లాపూర్ మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శనివారం ఉచిత హెచ్ పి వి వ్యాక్సినేషన్ పంపిణీ ని వైద్యాధికారిని డా. వాహిని, సర్పంచ్ చిట్యాల లక్ష్మణ్ , ఉప సర్పంచ్ గడ్డం సోమరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ వాహిని మాట్లాడుతూ.. వ్యాక్సిన్ ఆడవారిలో భవిష్యత్తులో సర్వైకల్ క్యాన్సర్ రాకుండా ఉంటుందన్నారు.14 సంవత్సరాలు నిండి 15 సంవత్సరాల దాటకుండా ఉన్న ఆడ పిల్లలందరూ వినియోగించుకోవాలని అన్నారు.
వ్యాక్సినేషన్ పూర్తిగా ఆన్లైన్ లో నమోదు అయి వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ ఇవ్వడం జరుగుతుందన్నారు.ఈ వ్యాక్సినేషన్ ద్వారా ఎలాంటి దుష్పరిణామాలు ఉండవన్నారు.7 గురు బాలికలకు హెచ్ పి వి వ్యాక్సినేషన్ చేశామని తెలిపారు. గ్రామాలలో అపోహలకు తావివ్వకుండా అర్హులైన పిల్లలందరూ వ్యాక్సినేషన్ తీసుకోవాల్సిందిగా సూచించారు.కార్యక్రమంలో
సర్పంచ్ చిట్యాల లక్ష్మణ్ ఉప సర్పంచ్ గడ్డం సోమరెడ్డి,వైద్యాధికారిని వాహిని
ఉమాదేవి మహేశ్వరి శ్రీనివాస్ శకుంతల, ఆశా కార్యకర్తలు లీలారాణి శిరీష, ప్రేమలత నాయకులు మోరపు గంగారాజాం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
