navageetam.com
Newspaper Banner
Date of Publish : 21 April 2026, 2:36 pm Digital Edition : NAVAGEETAM DAILY NEWS

ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోలుకోవాలని ప్రత్యేక పూజలు

తెలంగాణ రాష్ట్ర చిరంజీవి యువత ఆధ్వర్యంలో

నవగీతం,జగిత్యాల ప్రతినిధి:

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్  ఆరోగ్యం త్వరగా కోలుకోవాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర చిరంజీవి యువత అధ్యక్షుడు వేల్పుల వెంకటేష్ ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లాలో ని కొండగట్టు ఆంజనేయ స్వామి వారి ఆలయంలో అభిషేకం, ప్రత్యేక పూజలు, నిర్వహించారు.ఈ కార్యక్రమంలో వేల్పుల వెంకటేష్ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరోగ్యం త్వరగా కోలుకోవాలని ప్రత్యేక పూజలు చేసినట్లు వారి ఆయురారోగ్యాలు సుఖ సంతోషాలతో  ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో చిరంజీవి, రామ్ చరణ్ ఉమ్మడి కరీంనగర్ ఇన్‌చార్జ్ కపిల్ మాధవ మిడిదొడ్డి, చిరంజీవి, రామ్ చరణ్ కరీంనగర్ ఇన్‌చార్జ్ గాలిపెల్లి కుమార్, దిలీప్ రెడ్డి, అనిల్, నాగరాజ్, రాజేష్, శ్రీను తదితరులు మెగా అభిమానులు పాల్గొనారు.