navageetam.com
Newspaper Banner
Date of Publish : 13 April 2026, 2:00 pm Digital Edition : NAVAGEETAM DAILY NEWS

ఆర్టీసీ ఆధ్వర్యంలో రోడ్డు భద్రత వారోత్సవాల అవగాహన ర్యాలీ

బాధ్యతాయుతంగా వాహనం నడిపి,తమతో పాటు ఇతరుల ప్రాణాలను కాపాడాలి: డీఎస్పీ రాములు

నవగీతం,మెట్ పల్లి ప్రతినిధి:

ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక జాతీయ రోడ్డు భద్రత -2026 కార్యక్రమం లో భాగంగా మెట్ పల్లి ఆర్టీసీ డిపో సీనియర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ టి .ప్రమీల  ఆధ్వర్యంలో రోడ్డు భద్రత వారోత్సవాల ర్యాలీ నిర్వహించారు. ముఖ్యఅతిథిగా మెట్ పల్లి డిఎస్పీ ఏ.రాములు , సిఐ అనిల్ కుమార్ ఎస్సై పి .కిరణ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిఎస్పీ రాములు డ్రైవర్లని ఉద్దేశించి మాట్లాడుతూ..రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణాలు అతివేగం, డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్ వినియోగం, ట్రాఫిక్ నియమాలను పాటించకపోవడం వంటి అంశాలేనని పేర్కొన్నారు.

ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వాహనం నడిపి, తమతో పాటు ఇతరుల ప్రాణాలను కాపాడాలని పిలుపునిచ్చారు.ఒక ప్రైవేటు వాహనం లారీ లో గూడ్స్ అంటే వస్తువులు పాడవుతాయి కానీ ఒక బస్సు డ్రైవర్ నడుపుతున్న బస్సులో 50 మంది ప్రయాణికులు ప్రయాణిస్తారు కనుక వారు చాలా జాగ్రత్తగా నడపాలని అన్నారు. అందులో భాగంగా మెట్ పల్లి డిపో నుండి బస్టాండ్ వరకు డ్రైవర్, కండక్టర్ మరియు సెక్యూరిటీ గ్యారేజి, ఆఫీస్ సిబ్బంది నినాదాలు చేస్తూ అవగాహన కల్పిస్తూ మెట్ పల్లి  డిపో నుండి కొత్త బస్టాండ్ వరకు ర్యాలీ తీశారు.ఈ కార్యక్రమంలో మెకానిక్ సూపర్వైజర్ ఏ.చంద్రయ్య ఆఫీస్ డిప్యూటీ సూపర్డెంట్ పవన్ ,యండి. ముజిబ్ ఖాన్  ఆర్ హెచ్ సి ,ట్రాఫిక్ సూపర్వైజర్స్,మెకానికల్ సూపర్వైజర్స్, అలాగే డ్రైవర్లు కండక్టర్లు గ్యారేజి సిబ్బంది అలాగే సెక్యూరిటీ సిబ్బంది అధిక సంఖ్యలో పాల్గొన్నారు.