నవగీతం, జగిత్యాల ప్రతినిధి:
జగిత్యాల పట్టణంలోని మంచినీటి బావి వద్ద ఆంజనేయ స్వామి ఆలయాలలో గురువారం జరిగిన హనుమాన్ జయంతి ఉత్సవాల్లో మాజీ మంత్రి జీవన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఆలయంలో స్వామి వారిని దర్శించుకొని పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆయన వెంట హనుమాన్ భక్తులు ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.