navageetam.com
Newspaper Banner
Date of Publish : 14 April 2026, 8:50 pm Digital Edition : NAVAGEETAM DAILY NEWS

ఆహార వైవిధ్యం ప్రాముఖ్యత అవగాహన సదస్సు

నవగీతం మల్లాపూర్ ప్రతినిధి:

మల్లాపూర్ మండలం వెంకట్రావుపేట్ గ్రామంలో మంగళవారం రోజున ఆహార వైవిధ్యం ప్రాముఖ్యత గురించి అవగాహన సదస్సు ని సర్పంచ్ కనుముల వెంకటేష్ అధ్యక్షతన నిర్వహించారు. ఇట్టి కార్యక్రమంలో ముఖ్యంగా జంక్ ఫుడ్ వద్దు ఇంటి ఫుడ్ ముద్దే అని నినాదంతో గ్రామంలో ప్రధాన కూడల వద్ద ర్యాలీ నిర్వహించడం జరిగింది. పౌష్టికాహారం గురించి. అవగాహన కల్పించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో ఉప సర్పంచ్ తోట గంగా రెడ్డి, పాలక వర్గం సభ్యులు,పంచాయతీ కార్యదర్శి వేల్పుల సురేష్,కారోబార్ జోగులా నరేష్, అంగన్వాడీ టీచర్స్ యాదగిరి సంధ్యారాణి, తోటజమున, వేముల పద్మావతి,పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.