navageetam.com
Newspaper Banner
Date of Publish : 07 April 2026, 10:32 pm Digital Edition : NAVAGEETAM DAILY NEWS

ఇజ్రాయిల్ వేల్పూర్ ఫౌండేషన్ ఆర్థిక సహాయం

ఫౌండేషన్ యువకులను అభినందించిన గ్రామస్తులు

నవగీతం, వేల్పూర్ ప్రతినిధి:

వేల్పూర్ గ్రామానికి చెందిన ఆకుల సుశాంత్ ఇటీవల సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో  తీవ్రంగా గాయపడి హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు.ఆర్థిక పరిస్థితి బాగలేక సహాయం కోసం ఎదురు చూస్తున్నాడని తెలుసుకున్న ఎన్నారై ఇజ్రాయెల్ వేల్పూర్ ఫౌండేషన్ యువకులు ముందుకు వచ్చి రూ.1,15,000/-( ఒక లక్ష పదిహేనువేల రూపాయలు ) ఆర్థిక సహాయాన్ని వేల్పూర్ గ్రామ సర్పంచ్ మొండి అశోక్ చేతులమీదుగా వారి కుంటుంబ సభ్యులకు అందజేశారు. సుశాంత్ ఆరోగ్యం తొందరగా మెరుగుపడాలని కోరుకుంటూ, భవిష్యత్తులో కూడా ఇదే యూనిటీ తో గ్రామం లో మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ ఆపదలో ఉన్న వారికీ సహాయం చేస్తూ ఉంటామని ఫౌండేషన్ యువకులు తెలిపారు ఇజ్రాయిల్ ఫౌండేషన్ యువకులను సర్పంచ్ ప్రజా ప్రతినిధులు గ్రామస్తులు అభినందించారు.