navageetam.com
Newspaper Banner
Date of Publish : 14 April 2026, 7:14 pm Digital Edition : NAVAGEETAM DAILY NEWS

ఉచిత ఎక్స్ రే క్యాంపు సద్వినియోగం చేసుకోండి: మామిడి రాజు

నవగీతం ఇల్లంతకుంట ప్రతినిధి:

ఇల్లంతకుంట మండల కేంద్రంలోని పల్లె దవాఖానలో ఈ నెల 15,16 తేదీలో నిర్వహించే ఉచిత ఎక్స్ రే క్యాంప్ ను సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ మామిడి రాజు అన్నారు. గ్రామస్తులు దగ్గు,దమ్ము, కఫం,ఊపిరితిత్తులలో ఇన్ఫెక్షన్,ఆస్తమా వంటి లక్షణాలు అలెర్జీలు ఉన్నవారు ఈ ఉచిత ఎక్స్ రే క్యాంప్ ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.అలాగే దీని ద్వారా టీబీ వంటి వ్యాధిని ముందే గుర్తించి సరైన చికిత్స తీసుకోవచ్చని సూచించారు.