ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను అభినందించిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్

నవగీతం, జగిత్యాల ప్రతినిధి: జగిత్యాల జిల్లాలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు ఇంటర్మీడియట్ పరీక్షల్లో విశిష్ట ఫలితాలు సాధించాయి.ఈ సందర్భంగా అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థినులను జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్, అదనపు కలెక్టర్ (రెవిన్యూ) బి.ఎస్.లత తో కలిసి అభినందించి ప్రశంసించారు. వారి కృషి మరియు పట్టుదల ప్రశంసనీయమని పేర్కొన్నారు. ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరంలో కె.జి.బి.వి రాయికల్‌కు చెందిన ఎస్.శృతి 1000 మార్కులకు 988 మార్కులు. ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో కె. కార్తీక 500 మార్కులకు 492 మార్కులు సాధించారు.ఈ సందర్భంగా...