navageetam.com
Newspaper Banner
Date of Publish : 14 April 2026, 5:13 pm Digital Edition : NAVAGEETAM DAILY NEWS

ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు అందజేసిన ఉపసర్పంచ్

నవగీతం ఇబ్రహీంపట్నం ప్రతినిధి:

ఇబ్రహీంపట్నం మండలంలోని డబ్బా గ్రామంలో మహాత్మ ఉపాధి హామీ కూలీలకు మంగళవారం అంబేద్కర్ జయంతి పురస్కరించుకొని డబ్బా గ్రామ ఉపసర్పంచ్ రాపల్లి మహేష్, వార్డు సభ్యులు కనుక నాగరాజ్ బైండ్ల విశాల్, ఉపాధి హామీ మేటి మహేష్, వన సేవకులు చీకటి వేణు లను శాలువాతో ఘనంగా సత్కరించారు. అనంతరం అంబేద్కర్ జయంతి సందర్భంగా ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ ప్యాకెట్లను అందజేశారు. ఉపాధి హామీ కూలీలు ఎండ వేడిమికి తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ యూత్ ఉపాధ్యక్షులు పుప్పాల శ్రీనివాస్, కనుక జగ్గన్న, గొర్రె రాజేష్, ఆకు రమేష్, నరేష్, అనిల్, రంజిత్ అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు పాల్గొన్నారు