నవగీతం,కొడిమ్యాల ప్రతినిధి:
కొడిమ్యాల మండలం పూడూరు గ్రామంలో బుధవారం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంఎన్‌ఆర్‌ఈజీఎస్) పనులను జిల్లా అదనపు డీఆర్‌డీఓ మదన్మోహన్ పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామంలో కొనసాగుతున్న పనుల పురోగతి, కార్మికుల హాజరు, నాణ్యత ప్రమాణాలను ఆయన సమీక్షించారు.పనులు సమర్థవంతంగా నిర్వహించాలంటూ సంబంధిత అధికారులకు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో, ఏపీవో, పంచాయతీ కార్యదర్శి,స్థానిక సర్పంచ్, ఉప సర్పంచ్‌తో పాటు ఫీల్డ్ అసిస్టెంట్లు, సిబ్బంది పాల్గొన్నారు.